Friday, April 21, 2017

జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని Things to learn in one's Life



చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల "మాటలు"........

జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని


:point_right:1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.
:point_right:2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
:point_right:3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
:point_right:4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
:point_right:5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
:point_right:6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు.
:point_right:7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
:point_right:8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
:point_right:9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
:point_right:10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
:point_right:11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.
:point_right:12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
:point_right:13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
:point_right:14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం.
:point_right:15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
:point_right:16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.
:point_right:17. మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
:point_right:18. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
:point_right:19. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.
:point_right:20. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...