Sunday, May 27, 2018

The Story of an Interview

The Story of an Interview 


ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు.

చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............

చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.

*డైరెక్టరు* : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?

*యువకుడు*: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......

*డైరెక్టరు*: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?

*యువకుడు*: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా మార్చుకొని నన్ను చదివించారు.......

*డైరెక్టరు*: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.

*యువకుడు*: తన చేతులను చూపించాడు........
అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా ఉన్నాయి.

*డైరెక్టరు*: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో సహాయపడ్డావా?

*యువకుడు*: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.

*డైరెక్టరు*: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.

*డైరెక్టరు*: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.

*యువకుడు*: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.

*డైరెక్టరు*: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....
వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....

*యువకుడు*: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....
ఆ-చేతులు కాయలుగట్టి.........
కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి
రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......

ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు
తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.

మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....
ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."

మీరు నా కళ్ళు తెరిపించారు సర్!

నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"

దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"

ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......
కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...

నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.

*కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి

The Story of an Interview 

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...