Friday, May 12, 2017

Learning is eternal


Learning is eternal 


చిట్టి చీమను చూసి నేర్చుకోలేమా కష్టించి పనిచేయడం ఎలాగో..!కొవ్వొత్తిని చూసి అలవర్చుకోలేమా త్యాగంలో ఉన్న గొప్పతనమెంతో ..!పడిలేచే కడలి కెరటాలను చూసి గ్రహించలేమా పడినా కూడా తిరిగి ప్రవహిస్తూ పరుగులు తీయడమెలాగో..!విరిసే కుసుమాన్ని చూసి వివరించలేమా వాడిపోతా అని తెలిసినా పరిమళాను వెదజల్లుతూ పరులకోసం పాటుపడటం ఎలాగో...!చెట్టుని చూసి చెప్పలేమా తాను ఎండలో ఉంటూ నలుగురికి నీడనిస్తూ నిగర్వంగా నిలబడటం ఎలాగో...!వీచె గాలని చూసి విలువ తెలుసుకోలేమా నిశ్వార్ద సేవకు నిదర్శనం అంటే ఏమిటో ...!పండువెన్నెలను పంచే చందమామను చూసి గ్రహించలేమా పరులకోసం సాయపడటంలోని పరమార్దం ఏమిటో...!అస్తమించే సూర్యున్ని చూసిఅర్దం చేసుకోలేమా ఆశే శ్వాసగా రేపటికోసం ఎదురుచూస్తూ జీవించడమెలాగో...,,!!

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...