Rat
Strength is Life Weakness is Death
:rat::mouse:ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక.
:muscle:🏻:muscle:🏻 ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక.
:hankey::mount_fuji: అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. :cloud::cloud:
:cloud::partly_sunny: తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. :sun_with_face:
:sunny:
"నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు.
:couple: మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అంది. "అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. :negative_squared_cross_mark:
:partly_sunny::full_moon_with_face::new_moon_with_face:దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను" అన్నాడు సూర్యుడు.
:cloud::cloud: టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. "నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని" అంది మేఘం.
:dash::dash:
నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక.:rat:
:dash: గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, "నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను.
నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను" అంది.
:rat::mount_fuji:
ఎలుక కొండను పట్టుకుంది.
"నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది.
:smiling_imp:
దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది" అన్నది కొండ.
:curly_loop::curly_loop::curly_loop:
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే "నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం" అంది.
:mouse::mouse::mouse::mouse:
తాడుదగ్గరికే వెళ్ళితే "నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా" అంది తాడు.
:sunglasses::sunglasses:
తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది.
:mouse::hamster:
ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి.
'నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత...

No comments:
Post a Comment