Saturday, May 27, 2017

Small acts make great difference

Small acts make great difference

ఇది ఒక అద్భుత కథ!

అతి శీతల గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కథ!!ఆ రోజు పొద్దుపోయి.. చీకట్లు ముసిరిన వేళ. ఎవరికి వాళ్లు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ ఉండిపోయాడు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేశారు. గాలి చొరబడని శీతల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీనైనానని గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాననుకుంటున్న సమయంలో ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి.. ఆశ్చర్యం.. టార్చ్‌లైట్‌తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు.బయటకు వచ్చేటప్పుడు ఈ అద్భుత ఘటన నుంచి తేరుకుంటూనే నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్చారు? అడిగాడు గార్డ్‌ని..ఎవరూ చెప్పలేదు సార్! ఈ సంస్థలో 50 మందికి పైనే పనిచేస్తున్నారు. కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ హలో అని.. సాయంత్రం ఇంటికి వెళ్తూ బై చెప్పి పలకరించేది మీరొక్కరే సర్! ఈరోజు ఉదయం హలో అని పలకరించిన మీరు.. సాయంత్రం బై చెప్పలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను. అంతే సార్ అన్నాడు.అతనూహించలేదు. అతనికి ముందుగా తెలియదు. భేషిజం గాని బాసిజం గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపు పూర్వక సంజ్ఞ కారణంగా తన ప్రాణాలు నిలబడ్డాయని. మనకు తెలియకపోవచ్చు అటువంటి అద్భుతాలు మన జీవితంలో తారసపడవచ్చని!నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటివారి వైఖరి ఉంటుంది. అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రామాణికం కాదు!

Small acts make great difference

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...