Saturday, May 27, 2017

Honesty is the best policy


Honesty is the best policy
The story of a supervisor

*కూలబోయే ఇల్లు చెప్పిన పాఠం.!*  :pensive:ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తి లో ఉండేవాడు.తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.దాదాపు పాతిక సంవత్సరాలకు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పని చేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ణి పిలిచి 'మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి, ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. ఆ భవనం 'న భూతో, న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి ' అన్నాడు. ఇన్ని రోజులు పనిచేసిన మా యజమాని నాకు ఇచ్చిందేమీ లేదు,అతనేమో కోటీశ్వరుడయ్యాడు....... అంచేత, ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలాభాగం డబ్బు సొంతం చేసుకొంటాను అనుకున్నాడు. అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరుకులతో నిర్మించి, పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా, వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు. యజమాని ఆనందపడుతూ 'మిత్రమా...ఈ భవంతి మహత్తరంగా ఉంది.ఇన్నాళ్ళూ నమ్మకంగా పనిచేశావు..... నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశానికి వెళ్లిపోతున్నాను.అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని ఉన్న నీకు అపురూపమైన జ్ఙాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకొంటున్నాను. ఈ భవంతి నీ కోసమే.! అంటూ ఆ భవనాన్ని అప్పగించి వెళ్లిపోయాడు. ఆ యజమాని వెళ్ళాక కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో కూలబోయే ఆ భవనం లాగే!!
*మనిషి ధర్మం తప్పకూడదనీ, తుదిశ్వాస వరకూ దీన్ని విడిచిపెట్టకూడదనీ, అధర్మం గా "అర్థాన్ని" సంపాదిస్తే అనర్ధమే తప్ప, ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.*



Honesty is the best policy

No comments:

Post a Comment

Dukkipati Madhusudana Rao

Dukkipati Madhusudana Rao దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 - మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్ర...